శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (11:00 IST)

ప్లాస్టిక్ బ్యాగుల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం

కృష్ణా జిల్లాలోని ఓ ప్లాస్టిక్ సంచుల తయారీ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గన్నవరం మండలం తెంపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీవిద్య పాలిమర్స్ కంపెనీలో ఈ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 
 
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేయగలిగారు. ఈ ఘటనలో భారీ ఆస్తినష్టం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.