గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 25 మే 2021 (16:05 IST)

భారీ శబ్దంతో విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం, పరుగులు తీసిన ఉద్యోగులు

విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ పెద్దపెట్టున శబ్దం రావడంతో గాజువాక, మల్కాపురం ప్రాంత ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీసారు. బయట చూస్తే దట్టమైన పొగలతో శబ్దాలతో హెచ్‌పిసిఎల్ రిఫైనరీ నుంచి మంటలు కనబడుతున్నాయి.
 
 దీనితో అక్కడ భారీ అగ్నిప్రమాదమే సంభవించి వుంటుందని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో డేంజర్ సైరన్లు మోగించడంతో ఫ్యాక్టరీ నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. కానీ ప్రమాదం జరిగిన చోట పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియాల్సి వుంది. కాగా ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.