బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (12:14 IST)

వైఎస్. షర్మిళ కాన్వాయ్‌లో ప్రమాదం.. నలుగురికి గాయాలు...

వైఎస్ఆర్ పుత్రిక వైఎస్. షర్మిల కొత్త పార్టీ ఆవిష్కరణ సభ శుక్రవారం ఖమ్మంలో జరుగనుంది. ఇందుకోసం ఖమ్మం వెళుతోన్న వైఎస్ షర్మిల కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు వాహనాలు ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. 
 
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వైఎస్‌ షర్మిల సంకల్ప సభ జరగనుంది. ఇందుకోసం ఈ ఉదయం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని నివాసం నుంచి ఖమ్మం సభకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. 
 
అయితే, మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల ఖమ్మం చేరుకోవాల్సి ఉంది. శుక్రవారం జరిగే సంకల్ప సభలో వైఎస్‌ విజయమ్మ పాల్గొని షర్మిలను ఆశీర్వదిస్తారు. అటు, ఈ సభకు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాల నుంచి భారీగా వైఎస్‌ అభిమానులు తరలివస్తున్నారు. 
 
సంకల్పయాత్రకు బయల్దేరే ముందు షర్మిల ఆమె భర్త అనిల్ ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నందుకు ఆమె అనిల్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.