బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (14:35 IST)

పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్‌లో రాసిచ్చిన ఘనుడు ఎక్కడ?

తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కొత్తగా పార్టీని ఏర్పాటు చేయనున్న వైఎస్.షర్మిల మండిపడ్డారు. 'నిజామాబాద్ జిల్లాకు ప‌సుపు బోర్డు తెస్తాన‌ని ఎవ‌రో బాండ్ పేప‌రో ఇచ్చారంట‌... బాండ్ పేప‌ర్ ఇచ్చి రైతుల‌ను ద‌గా చేశారట'  అంటూ అరవింద్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 
 
ఆమె శుక్రవారం నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల వైఎస్ఆర్ అభిమానుల‌తో ష‌ర్మిల భేటీ అయ్యారు. శుక్రవారం లోటస్ పాండ్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
'ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి ఉండ‌టం తెలియ‌దా? ప‌సుపు రైతుల క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం, ఎక్స్‌టెన్ష‌న్ సెంట‌ర్ ఇస్తే ప‌సుపు రైతుల క‌ష్టాలు తీరుతాయా? ప్ర‌తి గ‌డ‌ప‌కు పూసే ప‌సుపు పండించే రైతు క‌ష్టాలు క‌న‌ప‌డ‌టం లేదా? బైంసాలో మత‌క‌ల్లోలాలు సృష్టించ‌డంపై ఉన్న ఆస‌క్తి రైతుల క‌ష్టాల‌పై ఉండ‌టం లేదా?' అని ప్రశ్నించారు.