బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (14:04 IST)

కాలేజీలో ఫుడ్ పాయిజన్.. మజ్జిగలో బల్లి పడటంతో.. 26మందికి?

food
అనంతపురం జిల్లా శింగనమలలో బాలికల కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కస్తూర్బా బాలికల కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. 
 
26మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. 
 
ఆస్పత్రికి చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఎమ్మెల్యే పద్మావతి పరామర్శించారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలను తెలుసుకున్నారు. అయితే మజ్జిగలో బల్లి పడినట్లు విద్యార్థినులు చెప్తున్నారు.