శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 24 మార్చి 2019 (09:43 IST)

నమ్మించి గొంతుకోశారు : మాజీ ఎంపీ జి.వివేక్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనను నమ్మించి గొంతుకోశారని మాజీ మంత్రి జి.వివేక్ ఆరోపించారు. తనకు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఇచ్చారనీ నమ్మించారనీ కానీ గొంతుకోశారని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పరిధిలోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం తాను ఎంతో కష్టపడ్డానని, తన కృషి వల్లే టీఆర్‌ఎస్‌ బలపడిందన్నారు. అయితే, తెరాస అభ్యర్థులకు తక్కువ మెజారిటీ రావడానికి తానే కారణమంటూ కొందరు తనపై బురద చల్లారన్నారు. 
 
తాను ఎప్పుడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, ఏ అభ్యర్థికీ డబ్బు ఇవ్వలేదనే విషయాన్ని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా, తనపై విశ్వాసం ఉందన్నారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేలు కుట్ర చేసి.. తనకు టికెట్‌ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం తన తండ్రి జి.వెంకటస్వామి జీవితాంతం పాటుపడ్డారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తాను తెరాసతో కలిసి పోరాడానన్నారు. 
 
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ బిల్లు పెట్టగానే తిరిగి కాంగ్రెస్‌లో చేరారన్నారు. అప్పటి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసినప్పటికీ పోటీ చేశానని గుర్తుచేశారు. పెద్దపల్లికికాకా పేరు పెట్టాలని అడిగినందుకే తనకు టికెట్‌ ఇవ్వలేదన్నారు. తెరాసకు రాజీనామా చేయడంతో బానిసత్వం పోయి స్వాతంత్య్రం వచ్చినట్లుందన్నారు.