గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : ఆదివారం, 24 మార్చి 2019 (09:16 IST)

24-03-2019 ఆదివారం దినఫలాలు : కర్కాటకం రాశివారు...

మేషం: ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి అనుకున్న పనులు సమర్థంగా నిర్వహిస్తారు. దైవదర్శనాలు, ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంలో అనుకున్నంత సంతృప్తికానరాదు. స్త్రీలకు ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. మెరుగైన నిర్ణయాలు తీసుకుని కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు పొందుతారు.
 
వృషభం: స్థిరచరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కిరాగలవు. మిత్రులతో కలిసివిందు, వినోదాలలో పాల్గొంటారు. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం.
 
మిధునం: వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య భాగస్వామిక వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు.
 
కర్కాటకం: కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. దానధర్మాలు చేయడం వలన మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. చీటికిమాటికి ఎదుటివారిపై అసహానం, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కొంతమంది మీ ఆలోచనలు పక్కదారి పట్టించేందుకు యత్నిస్తారు.
 
సింహం: ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరంచేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీల వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కన్య: దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతారు. దూరప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. 
 
తుల: స్త్రీలకు షాపింగ్ విషయాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల, ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ భావాలు, అభిప్రాయాలు ఎదుటివారు అర్థం చేసుకుంటారు.
 
వృశ్చికం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువులు రాకపోకలు అధికమవుతాయి. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. 
 
ధనస్సు: ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. మిత్రుల సహాయంతో ఒక సమస్యను సునాయసంగా పరిష్కరిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. 
 
మకరం: ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలోను, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ ఆశయం నెరవేరడానికి బాగా శ్రమించవలసి వస్తుంది. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల, ప్రయాణాలలో మెళకువ అవసరం. 
 
కుంభం: ఆర్థిక ఇబ్బందులు లేకున్నా అసంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ఆశయ సిద్ధికి ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. తలపెట్టిన పనిలో ఆటంకాలు, ఒత్తిడి వంటి చికాకులు ఎదురవుతాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. 
 
మీనం: ఏ వ్యవహారం కలిసి రాకపోవడంతో ఆందోళన చెందుతారు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వలన అశాంతికి గురవుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం. క్రీడా, కళ రంగాల్లో వారికి సంతృప్తికానరాదు. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు.