గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (09:08 IST)

20-03-2019 బుధవారం దినఫలాలు - మేషరాశివారు అలా చేస్తే...

మేషం: పత్రికా, ప్రైవేటు సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని అందుకోవడం క్షేమదాయకం. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొత్త బాధ్యతల చేపట్టే ఆస్కారం ఉంది. రుణాలు తీర్చుతారు. ఆదాయానికి లోటుండదు.
 
వృషభం: కీలకమైన విషయాలు మీరే సమీక్షించుకోవడం మంచిది. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. ఎండుమిర్చి కంది, పసుపు, ఉల్లి, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
మిధునం: నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో సంతృప్తినివ్వగలదు. ఉద్యోగ రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. ఎండుమిర్చి కంది, పసుపు, ఉల్లి, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
 
కర్కాటకం: టెక్నికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలలోని వారికి చికాకులు తప్పవు. విద్యార్థులకు విద్యా విషయాల్లో ఏకాగ్రత అవసరం. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. స్త్రీలకు పనివారల పట్ల సమస్యలు తలెత్తుతాయి. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.
 
సింహం: రావలసిన ధనం వాయిదాపడడం వలన నిరుత్సాహం చెందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సిమెంటు, ఇటుక, ఐరన్ వ్యాపారస్తులకు స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించడానికి చేయు యత్నాలు కలిసివస్తాయి.
 
కన్య: చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని తెలివి తేటలతో ముందుకు సాగి జయం పొందండి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పారిశ్రామిక రంగాలోని వారికి కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. బంధుమిత్రుల రాక మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. 
 
తుల: ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. వ్యాపారంలో కొంతమంది తప్పుత్రోవ పట్టించవచ్చు జాగ్రత్త వహించండి. బంధువులను కలుసుకుంటారు. కుటుంబీకుల కోసం నూతన పథకాలు వేస్తారు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తలెత్తగలవు. దైవసేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు.
 
వృశ్చికం: ఉద్యోగస్తులు అధికారుల తీరును గ్రహించి మితంగా సంభాషించడం శ్రేయస్కరం. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీసోదరులతో ఏకీభవం కుదరగలదు. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. వాహనచోదకులకు ఆటంకాలు తప్పవు. 
 
ధనస్సు: చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. ఇతరుల సలహాను పాటించుట వలన సమస్యలు తప్పవు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. 
 
మకరం: ముఖ్యులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడుతాయి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. స్త్రీలు దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. 
 
కుంభం: సంతానం విషయంలో సంతృప్తి కానరాగలదు. బంధువులను కలుసుకుంటారు. త్రిప్పిగొట్టగలుగుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. 
 
మీనం: ధన వ్యయంలో మెళకువ అవసరం. మీ లక్ష్యం, పట్టుదలచే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు.