ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (09:14 IST)

18-03-2019 సోమవారం దినఫలాలు

మేషం: నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు వ్యాపారస్తులకు కలసి వచ్చేకాలం. స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకల సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వలన అలసట అధికమవుతుంది. హోటల్, తినుబండ రంగాలలో వారికి అనుకూలమైన కాలం.
 
వృషభం: బంధువుల రాకతో గృహంలో సందడి కానవచ్చును. విద్యా విషయాల పట్ల ఆసక్తి పెరుగును. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. రిప్రజెంటేటిట్‌లు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్వతంత్య్ర నిర్ణయాలు చేసుకొనుట వలన శుభం చేకూరగలదు.
 
మిధునం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. సోదరీసోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. నిర్మాణ పథకాలలో మెళకువ అవసరం.
 
కర్కాటకం: భాగస్వామికుల మధ్య పరస్పర అవగాహన కుదురుతుంది. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. మీరు తొందరపడి సంభాషించడం వలన ఊహించని సమస్యలు తలెత్తగలవు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారులతో మాటపడక తప్పదు.
 
సింహం: కోర్టు వ్యవహారాలు, ఆస్తి పంపకాలు ఒక కొలిక్కి వస్తాయి. పీచు, ఫోమ్, లెదర వ్యాపారస్తులకు పురోభివృద్ధి. విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి మెళకువ అవసరం. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలలో జయం చేకూరును.
 
కన్య: బంధువులతో సమస్యలు తలెత్తవచ్చు. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా మెలగండి. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు, చిరువ్యాపారులకు పురోభివృద్ధి. సంగీత, నృత్య, సాహిత్య కళాకారులకు గుర్తింపుల, ఆదరణ లభిస్తుంది. విద్యార్థులు భయాం అందోళనలు విడచి అధికంగా కృషి చేసిన లక్ష్యం సాధించగలుగుతారు. 
 
తుల: ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా క్రమంగా సమసిపోతాయి. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శారీరకంగా బలం పుంజుకుంటారు. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. అవివాహితులకు శుభవార్తలు అందుతాయి. ఓర్పు, సర్దుబాటు ధోరణితో మెలగడం వలన కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
వృశ్చికం: ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం మంచిదికాదని గమనించండి. వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. మీకెదురైన అనుభవంతో మనస్సు మార్చుకుంటారు. 
 
ధనస్సు: మీ అవసరాలు, బలహీనతలు గమనించి ఇతరులు మిమ్ములను మోసగించేందుకు యత్నిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత ఉన్నా మునుముందు సత్ఫలితాలుంటాయి. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. మీ పనులు, కార్యక్రమాలకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. 
 
మకరం: విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కొత్త వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగండి. రావలసిన ధనం సకాలంలో అందడం వలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. కీలకమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించండి. 
 
కుంభం: చేపట్టిన పనులు ఎంతో శ్రమించిన కానీ పూర్తికావు. ఆపద సమయంలో స్నేహితులు అండగా నిలుస్తారు. ఖర్చులు అధికం. కాంట్రాక్టర్లు నూతన టెండర్లు చేజిక్కించుకుంటారు. పత్రికా, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం ఉంటుంది. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
మీనం: బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.