14-03-2019 గురువారం దినఫలాలు - మిథునరాశివారు స్వయంకృషితో...

astro 8
రామన్| Last Updated: గురువారం, 14 మార్చి 2019 (09:10 IST)
మేషం: ఇతరుల విషయాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. ప్రముఖల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశ్రమలు, సంస్థలకు కావలసిన లైసెన్సులు, పర్మిట్లు మంజూరుకాగలవు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు. దూరప్రయాణాలు లక్ష్యం నెరవేరుతుంది.

వృషభం: స్త్రీలు తలపెట్టిన పనుల్లో సఫలీకృతులవుతారు. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిదని గమనించండి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం మీకు లభిస్తుంది.

మిధునం: స్వయం కృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. స్థిరచరాస్థుల విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీల వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు.

కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా ఉంటాయి. ఉన్నత విద్యా, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగస్తాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు.

సింహం: వస్త్రం, బంగారు, వెండి వ్యాపారస్తులకు శుభదాయకం. సేవా, పుణ్య కార్యాలలో పాల్గొంటారు. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు.

కన్య: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధఇ. కుటుంబీకుల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.

తుల: ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్య్వూలలో విజయం సాధిస్తారు. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడుతాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో లౌక్యం అవసరం.

వృశ్చికం: ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండక గందరగోళంలో పడతారు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బంధువుల రాకతో ఊహించని ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. సోదరీసోదరులు సన్నిహితులకు సంబంధించి ఖర్చులు అధికం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం.

ధనస్సు: తలపెట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. మిత్రుల నుండి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది.

మకరం: సొంతంగా వ్యాపారం చేయాలన్న ఆలోచనలు వాయిదాపడుతాయి. బంధుమిత్రులతో పట్టింపులొస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. ప్రైవేటు, పత్రికా సంస్థల్లోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయవలసి ఉంటుంది. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తుంది.

కుంభం: హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. మీ నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు చేజారిపోతాయి. ఉపాధ్యాయుల విద్యార్థుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. స్త్రీలకు అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి.

మీనం: నిరుద్యోగులు ఇతరులకు సలహా ఇవ్వడం వలన మాటపడడక తప్పదు. ప్రముఖుల సహకారంతో మీ పాత సమస్యలు ఒక కొలిక్కివస్తాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. ప్రణాలికా బద్ధంగా వ్యవహరిస్తే రాజకీయ, కళా రంగాలకు చెందినవారు లక్ష్యాలు సాధిస్తారు.దీనిపై మరింత చదవండి :