శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (09:03 IST)

13-03-2019 బుధవారం దినఫలాలు - పరిచయాలు మీ పురోభివృద్ధికి ...

మేషం: వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఒక కార్యార్ధమై దూరప్రయాణం చేయవలసి వస్తుంది. రాజకీయ నాయకులకు మెళకువ అవసరం. ఉద్యోగస్తుల తొందరపాటు తనం వలన అధికారులతో మాటపడక తప్పదు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
వృషభం: వస్త్రం, బంగారం, వెండి, లోహ పనివారలకు, వ్యాపారులకు శుభదాయకం. బ్యాంకింగ్, చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్, ఎక్స్‌పోర్టు రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు.
 
మిధునం: ప్రైవేటు సంస్థల్లోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. తొందరపాటుతనం వలన కుటుంబీకులు, అవతలి వారితో మాటపడవలసివస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతుంది. 
 
కర్కాటకం: పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వైద్య, ఇంజనీరింగ్ రంగంలోని వారికి ఏకాగ్రత ఎంతో ముఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. అయిన వారిని కలుసుకోవడం కష్టమవుతుంది.
 
సింహం: మీ ఓర్పు, విజ్ఞతకు ఇది పరీక్షా సమయమని గమనించండి. విద్యార్థుల ఆలోచనులు పక్కదారి పట్టే సూచనలున్నాయి. ఊహించని ఖర్చులు, పెరిగిన అవసరాల వలన స్వల్ప ఇబ్బందులు తప్పవు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి.
 
కన్య: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆటుపోట్లు తప్పవు. సోదరీసోదరుల మధ్య విభేదాలు తప్పవు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాలలో వారికి చికాకులు వంటివి ఎదుర్కుంటారు. స్త్రీలకు అప్పుడప్పుడు ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. 
 
తుల: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. మీ కృషికి ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యుల పట్ల ఆరాధన పెరగగలదు. స్త్రీలు ఎదుటివారి ప్రభావానికి లోనవకుండా వాయిదాపడుతాయి.
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహం కానవస్తుంది. స్థిరచరాస్తుల విక్రయాలు వాయిదా పడుతాయి. స్పెక్యులేషన్ రంగాల్లో వారికి సామాన్యం. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచడం మంచిది. ఉద్యోగరంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. 
 
ధనస్సు: చిన్నతరహా పరిశ్రమలు, కార్మికులకు శ్రమాధిక్యత చికాకు తప్పదు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. పాతమిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి నుండి కొత్త విషయాలు గ్రహిస్తారు. 
 
మకరం: మార్కెటింగ్ రంగాల వారికి ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సత్ఫలితాలనిస్తాయి. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. 
 
కుంభం: మీ తొందరపాటుతం, మతిమరుపు కారణంగా విలువైన వస్తువులు, పత్రాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు చుట్టపక్కల వారి నుండి వ్యతిరేకత, పనివారలతో చికాకులు తప్పవు. విదేశీయాన యత్నాలలో పురోభివృద్ధి పొందుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. 
 
మీనం: వస్త్ర, బంగారం, వెండి వ్యాపారస్తులకు సంతృప్తికానరాదు. రియల్‌ఎస్టేట్ రంగాలవారికి ఒత్తిడి తప్పదు. ప్రేమికులు పెద్దల వలన సమస్యలు ఎదుర్కుంటారు. అప్పుడప్పుడు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి.