గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 23 మార్చి 2019 (09:26 IST)

23-03-2019 దినఫలాలు - వృషభ రాశివారు అలా చేస్తే...

మేషం : ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కున్న నెమ్మదిగా సమసిపోతాయి. విద్యార్థుల మొండి వైఖరి అవలంబించుట వల్ల మాటపడక తప్పదు. నిర్మాణ పనుల్లో కంట్రాక్టర్లకు ఏకాగ్రత, పర్యవేక్షణ ఎంతో అవసరం. కలప, ఇటుక, ఇసుక వ్యాపారస్తులకు పురోభివృద్ధి పొందుతారు. దూరప్రయాణాలు చేస్తారు.
 
వృషభం : వస్త్ర, బంగారం, వెండి, రత్న వ్యాపారులకు లాభదాయకం. సోదరి, సోదరుల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తుతాయి. ప్రముఖులను కలుసుకోవాలన్న యత్నం సానుకూలమవుతుంది. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించడం మంచిది. విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు.
 
మిథునం : ఉద్యోగస్తులు తోటివారి నుండి ఆహ్వానాలు అందుకుంటారు. విదేశాలలో ఉన్న మీ స్నేహితుల సహాయంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయులకు విలువైన కానుకలు అందించి మీ అభిమానం చాటుకుంటారు. ఏదైనా అమ్మకానికై చేయు యత్నాలలో సఫలీకృతులవుతారు.
 
కర్కాటకం : మార్కెటింగ్, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. దూరప్రయాణాలలో వస్తువల పట్ల మెళకువ అవసరం. రాజకీయాలలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. స్వయంకృషితో బాగా రాణిస్తారు.
 
సింహం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత, పనిభారం. బంధుమిత్రులతో మీ కార్యక్రమాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ నూతన ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి.
 
కన్య : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. పత్తి, పొగాకు, మిర్చి, నూనె వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. మీ వ్యక్తిగత భావాలను బయటకు వ్యక్తం చేయకండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం.
 
తుల : వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండగలదు. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించలేరు. గృహోపకరణాలకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు చుట్టు పక్కలవారితో లౌకికం చాలా అవసరం.
 
వృశ్చికం : బ్యాంకింగ్ రంగంలోని వారికి పనిభారం, ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. వృత్తుల్లో వారు, వైద్యులు తమ తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలకు గురవుతారు. సంగీత. నృత్య కళాకారులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసిన బాకీలు వసూలవుతాయి.
 
ధనస్సు : మీ ప్రియతముల కోసం, సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలుపెడతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు.
 
మకరం : పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలకు ముఖ్యుల రాకపోకలు, బరువు బాధ్యతలు అధికం కావడం వల్ల ఆందోళనకు గురవుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. విద్యార్థినులు మతిమరపుతనానికి లోనవుతారు. ఏజెంట్లు, బ్రోకర్లు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.
 
కుంభం : ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికం. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. దైవ, సేవా, సాఘింక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ముఖ్యులతో సంప్రదింపులు మీకు ఎంతో ఆనందం కలిగిస్తాయి. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త వహించండి.
 
మీనం : ఆర్థికస్థితి ఒకింత మెరుగుపడటంతో ఊరట చెందుతారు. బంధుమిత్రుల రాకపోకల వల్ల అసౌకర్యానికి లోనవుతారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ప్రేమికుల మధ్య అనుకోని సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. స్త్రీలకు పనిభారం అధికం.