శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (09:19 IST)

21-03-2019 దినఫలాలు - కర్కాటక రాశివారు ఆర్థిక విషయాల్లో

మేషం: బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు. ప్రత్యర్థుల ఎత్తుగడలను సమర్థంగా ఎదుర్కుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు ఒక కొలిక్కివస్తాయి. ఉపాధ్యాయుల తొందరపాటు తనం వలన సమస్యలు తలెత్తుతాయి.
 
వృషభం: విద్యార్థులు భయాందోళనలు వీడి మరింత కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. నూతన వ్యాపారులకు కావలసిన వనరులు, అనుమతులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి.
 
మిధునం: చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ప్రముఖులను కలుసుకుంటారు. అకాల భోజనం, విశ్రాంతి లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. దూరప్రయాణాలలో ఆశ్చర్యకరమైన వార్తలు, సంఘటనలు చోటు చేటుకుంటాయి.
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు షాపింగ్‌లోను, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. రాబడికి మించిన ఖర్చులు అధికమవుతాయి. మిత్రులను కలుసుకుంటారు. ఒక శుభకార్యానికి హాజరు కావడం వలన సన్నిహితుల నుండి అసంతృప్తి ఎదురవుతుంది.
 
సింహం: విదేశీయానం కోసం చేసే యత్నాలకు మార్గం సులభమవుతుంది. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు, సత్సంబంధాలు మెరుగుపడుతాయి. వస్త్రం, బంగారం, ఫ్యాన్సీ ఉద్యోగస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. ధన వ్యయం అధికమైనా సార్థకత ఉంటుంది.
 
కన్య: వృత్తి, ఉద్యోగస్తులకు చికాకులు తప్పవు. బంధువుల రాకపోకలు అధికంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త సమస్యలు తలెత్తుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. దైవ కార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.
 
తుల: విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభించినా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి, కార్మిక సమస్యలు తప్పవు. ఉన్నత స్థాయి అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది.
 
వృశ్చికం: హోటల్, నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందుతారు. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. మిత్రులను కలుసుకుంటారం. ఆడిటర్లకు పని ఒత్తిడి, ప్లీడర్లకు నిరుత్సాహం తప్పవు. విద్యార్థినులకు టెక్నికల్, కామర్స్, కంప్యూటర్ విద్యలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు: ప్రింటింగ్ రంగాల వారికి కొత్త పనులు చేపట్టే విషయంలో పోటీ అధికమవుతుంది. బంధువుల రాక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అపరిచితుల పట్ల అప్రమత్తత అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. గణిత, సైన్సు, కామర్స్ రంగాలవారికి గుర్తింపు, సదవకాశాలు లభిస్తాయి. ఋణం కొంత అయిన తీర్చ గలుగుతారు.
 
మకరం: రాజకీయ నాయకులకు మెళకువ అవసరం. మీరు తీసుకున్న నిర్ణయం మొదటిలో కాస్త ఇబ్బంది అనిపించినా క్రమేణా అదే మంచిదనిపిస్తుంది. సోదరులతో ఏకీభవించలేకపోతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఏజెంట్లుకు మెళకువ అవసరం. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.
 
కుంభం: మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. ఖర్చులు అధికమవుతాయి. దస్త్రం వివాహ, శుభకార్యాలకు సంప్రదింపులు జరుపుతారు. మీ పెద్దల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పనిలో అంచనాలు తారుమారు కావచ్చు.
 
మీనం: బ్యాంకింగ్ రంగాలవారికి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగులు గట్టిపోటి ఎదుర్కోవలసి వస్తుంది. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువులపై ఆకర్షితులవుతారు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తారు. ప్రైవేటు, పత్రికా రంగాల్లోవారికి అధికారులతో సమస్యలను ఎదుర్కుంటారు.