ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (09:53 IST)

22-03-2019 - శుక్రవారం మీ రాశిఫలితాలు - పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని...

మేషం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వర్టర్, ఎ.సి మెకానికల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో ఎంతో పక్కగా వేసుకున్న ప్రణాళికలు విఫలమవుతాయి. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కుంటారు. అవసరానికి రుణాలు సకాలంలో అందవు. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు.
 
వృషభం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖుల పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సోదరీసోదరులతో మనస్పర్ధలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. 
 
మిధునం: గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడుతాయి. బ్యాంకు పనులు కలిసివస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన అధికమవుతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
 
కర్కాటకం: వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. సన్నిహితుల సలహాలు, హితోక్కులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఎవరికైనా ధనం సహాయం చేసినా తిరిగిరాజాలదు. స్త్రీలకు తల, కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు వ్యాపారులకు కలిసిరాగలదు.
 
సింహం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. నూనె, కంది, మినుము, ఎండుమిర్చి, పసుపు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు ఫలించగలవు.
 
కన్య: వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ఉపాధ్యాయులకు సంతృప్తి కానవస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ అవసరం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. రావలసిన మొండిబాకీలు వాయిదా పడుతాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
తుల: మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖల కంపెనీల షేర్ల విలువలు నిలకడగా ఉంటాయి. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. వాహనం నిదానంగా నడపడం అన్ని విధాల క్షేమదాయకం. 
 
వృశ్చికం: రుణ, విదేశీ యత్నాలు ఫలిస్తాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం పొందుతారు. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించగలరు. కోర్టు వ్యవహారాలు, సంప్రదింపులతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. వాహనం మరమ్మత్తులకు గురవుతుంది. 
 
ధనస్సు: పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు సానుకూలమవుతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. కోర్టు వ్యవహారాలు హియరింగ్‌కు వస్తాయి. పత్రికా సంస్థల్లోని వారికి ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళన తప్పవు. పారిశ్రామిక రంగాలవారికి కార్మికులు, విద్యుత్ సమస్యలు అధికం. 
 
మకరం: బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఊహించని ఖర్చులుంటాయి. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయడం మంచిది. ఒక ఆహ్వానం మిమ్ములను ఇబ్బందికి గురిచేస్తుంది. ఇంజనీరింగ్, మెడికల్, లా విద్యార్థులకు ఏకాగ్రత ముఖ్యం. 
 
కుంభం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రాబడికి తగ్గ ఖర్చులు ఉండడం వలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. బీమా ఏజెంట్లకు, స్థలాల బ్రోకర్లకు చికాకులు, ఆందోళనలు తప్పవు. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు.  
 
మీనం: స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో స్థిరపడడంతో పాటు ఇతరులకు మార్గదర్శకమవుతారు. పంతాలకు పోకుండా లౌక్యంగా మీ వ్యవహారాలు చక్కబెట్టుకోవలసి ఉంటుంది. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. మీ ప్రమేయంతో అయిన వారి సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి.