శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 23 మార్చి 2019 (20:19 IST)

హారతిని కళ్లకు ఎందుకు అద్దుకోవాలి?

హారతి జ్యోతి స్వరూపం. ఆ వెలుగు అంధకారాన్ని తొలగించి ఈ జగతికి వెలుగును ప్రసాదిస్తుంది. పరమాత్మ పరంజ్యోతి. మనలోని గాడమైన అజ్ఞానంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని కలుగజేస్తాడు. అజ్ఞానం వలన పరమాత్మ స్వరూపం మనకు కనిపించదు కనుక ఆ గాఢమైన అంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని కలిగించమని వేడుకుంటూ హారతిని కళ్లకు అద్దుకోవాలి.
 
జాగ్రదవస్థలో మన కుడి కంటిలో పరమాత్మ ఉన్నాడని శ్రుతివాక్యం. సాంకేతిక పరంగా చూసినట్లయితే కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం వలన పరిసరాల్లో గాలిలో ఉన్న సూక్ష్మక్రిములు నశిస్తాయి. శ్వాసకోశవ్యాధులు, అంటువ్యాధులు దరిచేరవు. నిజానికి కర్పూరం ఎలాగైతే కరిగిపోతుందో అచ్చంగా అలాగే మనలో నిండి ఉన్న అజ్ఞానంధకారం కూడా ఆవిరైపోవాలని, కోరుకుంటూ హారతిని కళ్లకు అద్దుకోవాలి.