బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (15:12 IST)

ఆళ్లగడ్డ గణేశ్ నిమజ్జనంలో అపశృతి.. నీటిలో పడిపోయిన యువకుడు

Ganesh immersion
Ganesh immersion
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ గణేశ్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా అదుపు తప్పి నీటిలో యువకుడు పడిపోయాడు. దీంతో ఐదు బృందాలతో పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. 
 
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ముగ్గురు యువకులు నీళ్లలో పడిపోయారు. ఇద్దరు తిరిగి పైకి ఎక్కగా శేఖర్ రెడ్డి అనే యువకుడు మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. శేఖర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.