బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నేడు ఆళ్ళగడ్డ వేదికగా రైతు భరోసా నిధుల పంపిణీ

ys jagan
నంద్యా జిల్లాలోని ఆళ్ళగడ్డ వేదికగా పీఎం కిసాన్ - వైఎస్ఆర్ రైతు భరోసా నిధుల పంపిణీ జరుగనుంది. ఇందుకోసం ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ జిల్లాలోని ఆళ్లగడ్డలో జరిగే వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిస్సాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 
 
ఇందుకోసం ఆయన విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి ఉదయం 10.15 గంటలకు ఆళ్ళగడ్డకు చేరుకుంటారు. 10.45 గంటలకు ప్రభుత్వ జేఆర్ కాలేజీ క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. 
 
ఇక్కడ నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి రైతు భరోసా నిధులను అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.35 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.