ఇంటికి పిలిచి బ్యూటీషియన్‌పై గ్యాంగ్ రేప్!... నిందితుల్లో ఎమ్మెల్సీ కుమారుడు?
హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఓ పబ్‌లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఇంటికి రప్పించి.. ఓ గదిలో బంధించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులను కూడా ఇంటికి పిలి
హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఓ పబ్‌లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఇంటికి రప్పించి.. ఓ గదిలో బంధించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులను కూడా ఇంటికి పిలిచి.. ఆ తర్వాత గ్యాంగ్ రేప్‌కు యత్నించారు. ఈ దారుణానికి పాల్పడిన కామాంధుల్లో ఓ ఎమ్మెల్సీ కుమారుడు కూడా ఉండటం గమనార్హం. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
హైదరాబాద్, బంజారాహిల్స్‌లో బ్యూటీషియన్‌గా పని చేసే 23 యేళ్ల యువతి.. కొంపల్లిలోని ఫాంమెడోస్‌లో నివసించే ప్రీతంరెడ్డి (26)కి ఇటీవల ఓ పబ్‌లో పరిచయమైంది. దీంతో ఆమెను వివాహం చేసుకుంటానని పలుమార్లు సందేశాలు పంపి నమ్మించాడు. ఆ తర్వాత ఆమెతో ఫోన్ సంభాషణ మొదలెట్టాడు.
ఈ నేపథ్యంలో ఈనెల 5వ తేదీన తన ఇంట్లో ఎవరూలేరని ఇంటికి రావాలని ఆ యువతికి చెప్పాడు. ప్రీతం రెడ్డి మాటలు విన్న ఆ యువతి ఇంటికి వెళ్లగా, ఓ గదిలో బంధించి అత్యాచారం చేశాడు. అనంతరం గదిలో పెట్టి తన ఇరువురు స్నేహితులను తీసుకువచ్చి వారి కోరికను తీర్చాలని బలవంతపెట్టాడు. ముగ్గురు కలిసి యువతిని కారులో ఎక్కించుకుని దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. తమ తమ పైశాచికానందం తీరిన తర్వాత ఓ చోట దింపి వెళ్లిపోయారు.
అయితే, తన వద్ద డబ్బు లేకపోవడంతో లేకపోవడంతో సమీపంలోని జిమ్‌లోని ఓ యువతి వద్ద రూ.400 తీసుకుని బాధిత యువతి ఆటోలో ఇంటికి వెళ్లింది. అనంతరం జరిగిన ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం సాయంత్రం ఫాంమెడోస్‌లోని సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.