శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (10:26 IST)

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం.. ప్రేమిస్తున్నానని నమ్మించి..?

gang rape
గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రేమ పేరుతో గిరిజన బాలికను నమ్మించి ఓ ఆటోడ్రైవర్‌ తన మిత్రులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా శింగరాయకొండ, బింగినపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. 
 
బింగినపల్లి గిరిజన కాలనీకి చెందిన దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. తమ కుమార్తెను అమ్మమ్మ ఇంటి వద్ద విడిచి వెళ్లారు. అమ్మమ్మ, బాలిక కలిసి రోజూ కూలి పనులకు వెళ్లేవారు. అదే గ్రామానికి చెందిన ప్రతాప్‌ అనే ఆటో డ్రైవర్‌ ప్రేమ పేరుతో బాలిక వెంటపడేవాడు. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఈ క్రమంలో మాట్లాడాలని నమ్మించి, గ్రామ సచివాలయం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తన మిత్రులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పింది. గ్రామ పెద్దలు విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు ప్రతాప్‌, హరి, రామారావును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.