1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 4 అక్టోబరు 2017 (13:56 IST)

కడుపులో బంగారం బిస్కెట్లు... మల విసర్జన చేసి 16 బయటకు...

ఆ స్మగ్లర్ మామూలోడు కాదు. బంగారం స్మగ్లింగ్ చాలామంది లోదుస్తుల్లోనో, బెల్టుల్లోనో... తదితర మార్గాల ద్వారా చేరవేస్తుంటారు. కానీ శ్రీలంక దేశానికి చెందిన స్మగ్లర్‌ అబ్దుల్‌ రజాక్‌ మాత్రం బంగారం బిస్కెట్లను ఏకంగా మింగేసి విశాఖపట్టణానికి వచ్చాడు. కస్టమ్స్

ఆ స్మగ్లర్ మామూలోడు కాదు. బంగారం స్మగ్లింగ్ చాలామంది లోదుస్తుల్లోనో, బెల్టుల్లోనో... తదితర మార్గాల ద్వారా చేరవేస్తుంటారు. కానీ శ్రీలంక దేశానికి చెందిన స్మగ్లర్‌ అబ్దుల్‌ రజాక్‌ మాత్రం బంగారం బిస్కెట్లను ఏకంగా మింగేసి విశాఖపట్టణానికి వచ్చాడు. కస్టమ్స్ అధికారులు అతడిపై అనుమానం రావడంతో కెజిహెచ్‌కు తరలించి ఎక్స్‌రే తీయించగా కడుపులో బంగారు బిస్కెట్లు ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. దీనితో అతడిని ఆసుపత్రిలోనే వుంచారు. 
 
సోమవారం నుంచి మంగళవారం వరకూ మొత్తం 16 బంగారం బిస్కెట్లు మలవిసర్జన ద్వారా బయటకు వచ్చాయి. కాగా అతడికి ఇలా బంగారం బిస్కెట్లను మింగడం ఆ తర్వాత మల విసర్జన ద్వారా రప్పించడంలో నైపుణ్యం సాధించినవాడిగా కనుగొన్నారు. అందువల్లే అతడికి ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తలేదని తేల్చారు. కాగా ఇతడితోపాటు మరికొందరు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుని ఓ ముఠాలా మారి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.