శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (12:20 IST)

నోటి దుర్వాసన పోవాలంటే.. మిరియాల పొడి, నువ్వులనూనె?

నోటి దుర్వాసన వేధిస్తుందా.. నలుగురు మాట్లాడలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి. ఉప్పు, నిమ్మ తొక్కల్ని ఉపయోగించండి. నిమ్మరసంతో బ్రష్ చేసుకోవడం ద్వారా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. నీటిని ఎక్కువగా తీసు

నోటి దుర్వాసన వేధిస్తుందా.. నలుగురు మాట్లాడలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి. ఉప్పు, నిమ్మ తొక్కల్ని ఉపయోగించండి. నిమ్మరసంతో బ్రష్ చేసుకోవడం ద్వారా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. నీటిని ఎక్కువగా తీసుకోండి.
 
నోటి దుర్వాసన పోవడానికి ఉప్పు భేష్‌గా పనిచేస్తుంది. కొంచెం మెత్తటి ఉప్పును నీటితో కలిపి పేస్టులా చేసుకుని బ్రెష్‌తో తోముకుంటే పళ్ళు మెరుస్తాయి. అంతే కాదు ఉప్పు వలన నోటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోయి దుర్వాసన పోతుంది. పళ్ళకు పట్టిన గార కూడా తొలగిపోతుంది. 
 
రోజూ ఉదయం పళ్ళు శుభ్రంగా తోపుకున్న తరువాత గోరువెచ్చటి నీటిలో కొంచె ఉప్పు వేసి పుక్కిలించాలి. ఆ తరువాత మంచి నీటితో పుక్కిలించాలి. ఈ విధంగా రోజూ చేస్తే నోటి వాసన పోతుంది. కొంచెం మిరియాల పొడి, పసుపు, ఉప్పు, నువ్వుల నూనె పేస్టులా చేసి పళ్లు తోమితే చిగుళ్ల వ్యాధులు దూరమై.. నోటి దుర్వాసన తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.