బుధవారం, 13 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (11:32 IST)

నట్స్ తినండి.. యంగ్‌గా కనిపించండి..

బ్లూ, బ్లాక్ బెర్రీస్ తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. మైదా, ఉప్పు, పంచదారను బాగా తగ్గిస్తే చర్మ సమస్యలుండవు. అవకాడో శరీరంలో ఉన్న అధిక కొవ్వును తగ్గిస్తుంది, ఇందులోని విటమిన్ ''ఇ'' వృద్ధాప్య ఛాయ

బ్లూ, బ్లాక్ బెర్రీస్ తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. మైదా, ఉప్పు, పంచదారను బాగా తగ్గిస్తే చర్మ సమస్యలుండవు. అవకాడో శరీరంలో ఉన్న అధిక కొవ్వును తగ్గిస్తుంది, ఇందులోని విటమిన్ ''ఇ'' వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. వాల్‌నట్స్ తీసుకోవడం, క్యాబేజీ, బ్రకోలీ, మొలకలు లాంటివి శరీరంలో ఏర్పడే టాక్సిన్లతో పోరాడి ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి. 
 
నట్స్ రోగనిరోధక శక్తిని పెంచి చర్మం పొడిబారడాన్ని నివారిస్తాయి. పుచ్చకాయలో ఉండే విటమిన్ ‘ఎ, బి, సి’ లు ఫ్రీ రాడికల్స్‌తో పొరాడి చర్మం మెరిసేందుకు ఉపయోగపడతాయి. ముల్లంగి, టర్నిప్‌లు యాంటీ ఏజింగ్ లక్షణాలను నివారణలో అద్భుతంగా పనిచేస్తాయి.
 
విటమిన్ డి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తూ ఆస్టియోఫోరోసిస్‌ను నివారిస్తుంది. ఎండవల్ల వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని విటమిన్ ఎ నివారిస్తుంది. ఇది క్యారెట్, బ్రకోలి, టమాటో వంటి వాటిల్లో లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.