శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (14:12 IST)

వీర్యానికి మేలు చేసే మందారం

మందార పువ్వులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పది మందార పువ్వులను నమిలి తిని రోజూ గ్లాసుడు పాలు తీసుకుంటే వీర్యకణాలు చిక్కగా తయారవుతాయి. వీర్యకణాలు పల్చగా వుంటే రెండు స్పూన్ల మందార పువ్వుల పొడిని నోట్లో వేసు

మందార పువ్వులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పది మందార పువ్వులను నమిలి తిని రోజూ గ్లాసుడు పాలు తీసుకుంటే వీర్యకణాలు చిక్కగా తయారవుతాయి. వీర్యకణాలు పల్చగా వుంటే రెండు స్పూన్ల మందార పువ్వుల పొడిని నోట్లో వేసుకుని ఓ గ్లాసుడు పాలు తీసుకోవాలి. ఇలా 40 రోజులు చేయాలి. ఇలా చేస్తే వీర్యకణాల్లో నాణ్యత పెరుగుతుంది. సంతానలేమికి చెక్ పెట్టవచ్చు. మందారం పువ్వు పొడితో మునగ పువ్వులు లేదా మునగ విత్తనాల పొడిని చేర్చి తీసుకుంటే సంతాన లోపాలు తొలగిపోతాయి. 
 
ఇక మందార పువ్వులను రోజూ ఐదేసి నీటిలో మరిగించి ఆ నీటిని ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే హద్రోగాలు దరిచేరవు. మందార పువ్వులను నువ్వుల నూనెతో వేడి చేసి ఆ నూనెను మాడుకు, కుదుళ్లకు రాస్తే జుట్టు రాలవు. ఈ పువ్వులను ఎండబెట్టి పొడిగొట్టి పెట్టుకుని, అందుకు సమానంగా దాల్చిన చెక్క పొడిని చేర్చి ఉదయం, సాయంత్రం తీసుకుంటే హృద్రోగ సమస్యలు దూరమవుతాయి. 
 
500 గ్రాముల మందార పువ్వులను బాగా రుబ్బుకుని... అందులో కేజీ పంచదారను కలిపి, కావలసిన నీటిని చేర్చి మరిగించి.. చిక్కబడ్డాక వడగట్టి రోజుకు 15 మి.లీ మోతాదులో రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి.