గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (13:04 IST)

అర‌టి పువ్వు కూరతో ఎన్ని లాభాలో...

ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండ్లలో అరటిపండు ఒకటి. దీన్ని ఆరగించడం వల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కలుగుతాయి. శ‌రీరానికి పోష‌కాలు అంద‌డ‌మే కాదు, అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండ్లలో అరటిపండు ఒకటి. దీన్ని ఆరగించడం వల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కలుగుతాయి. శ‌రీరానికి పోష‌కాలు అంద‌డ‌మే కాదు, అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. పైగా శ‌రీరానికి పుష్కలమైన శ‌క్తి ల‌భిస్తుంది. అయితే, అరటి పండు కంటే అరటిపువ్వుతో మరిన్ని లాభాలాలు ఉన్నట్టు గృహవైద్యులు చెపుతున్నారు. 
 
అరటిపువ్వును కూరగా చేసుకుని ఆరగించడం వల్ల జీర్ణాశ‌యంలో అల్స‌ర్లు కరిగిపోతాయట. హైబీపీ అదుపులో ఉంటుందట. స్త్రీల‌లో గ‌ర్భాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు పూర్తిగా తొలగిపోతాయట. 
 
మూత్ర‌పిండాల వ్యాధుల‌తో ఇబ్బందులు ప‌డే వారు, కిడ్నీల్లో రాళ్లు ఉండేవారు అర‌టిపువ్వు కూర‌ను తిన‌డం వల్ల సమస్య నుంచి గట్టెక్కవచ్చట. అర‌టిపువ్వు కూర వ‌ల్ల జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటివి దూర‌మ‌వుతాయి. 
 
పాలిచ్చే త‌ల్లుల‌కు ఇది మంచి ఆహారం. చాలా పోష‌కాలు ల‌భించ‌డం వ‌ల్ల అటు త‌ల్లికి, ఇటు శిశువుకు కూడా మంచి చేస్తుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు అర‌టిపువ్వు కూర‌ను త‌ర‌చూ తింటుంటే వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు క్ర‌మంగా త‌గ్గిపోతాయి. షుగ‌ర్ అదుపులోకి వస్తుంది. అలాగే, అరటి పువ్వు కూర‌ను త‌ర‌చూ తింటుండ‌టం వ‌ల్ల స్త్రీల‌కు రుతుక్ర‌మం స‌రిగ్గా ఉంటుంది.