ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2017 (12:14 IST)

శంఖుపువ్వులతో ఆరోగ్యానికి మేలెంత? గ్లాసుడు నీటిలో ఐదు శంఖు పువ్వుల్ని వేసి?

శంఖువు రూపంలో నీలిరంగులో వుండే పుష్పాలు చూసేవుంటారు. ఈ నీలి రంగు పువ్వులు శనీశ్వరుడికి సమర్పిస్తే.. శనిదోష ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు అంటారు. అయితే ఈ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట

శంఖువు రూపంలో నీలిరంగులో వుండే పుష్పాలు చూసేవుంటారు. ఈ నీలి రంగు పువ్వులు శనీశ్వరుడికి సమర్పిస్తే.. శనిదోష ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు అంటారు. అయితే ఈ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. నీలి రంగుతో కనిపించే ఈ పుష్పం మానసిక ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తుందట. ఈ నీలపు శంఖు పువ్వుల చెట్టు ఆకులతో పసుపుతో రుబ్బి.. వాపు తగ్గుతుంది. 
 
మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంఖుపువ్వులు సూపర్‌గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతాన లేమి, యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే శంఖుపువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఈ శంఖు రూపంలో వుండే పువ్వును థాయ్‌లాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్‌లో రాయల్ ఫుడ్స్‌లో చేరుస్తున్నాయి. ఈ పువ్వును అక్కడ బటర్ ఫ్లై ఫ్లవర్ (Butterfly Pea Flower) అని పిలుస్తున్నారు. ఈ పువ్వును మాసంలో రెండుసార్లు ఆహారంగా తీసుకోవడం ద్వారా మానసిక ఆందోళన మాయమవుతుంది. 
 
ఇది శరీరంలోని  ఆమ్లాన్ని తొలగించే యాంటీయాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలన నయం చేస్తుంది. ఒక గ్లాసుడు నీటిలో ఐదు నీలపు శంఖుపువ్వులను వేసి పది నిమిషాల పాటు నాన బెట్టి.. ఆ నీటిని తేనెతో కలుపుకుని తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే ఈ పానీయాన్ని మాసానికి ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.