శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2016 (08:30 IST)

నయీంకు బోర్ కొట్టినపుడుల్లో రాసలీలల్లో మునిగి తేలేవాడట.. ప్రతిసారి ఓ కొత్త భామతో...

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీంకు సంబంధించిన ఒక్కో విషయం ఇపుడు వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా, ఆయన జీవించి ఉన్న సమయంలో ఆయన అమ్మాయిలతో నడుచుకున్న తీరు, వ్యవహారశైలిలు వెలుగులోకి వస్తున్నాయ

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీంకు సంబంధించిన ఒక్కో విషయం ఇపుడు వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా, ఆయన జీవించి ఉన్న సమయంలో ఆయన అమ్మాయిలతో నడుచుకున్న తీరు, వ్యవహారశైలిలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నయీంకు బోర్ కొట్టినపుడల్లా అమ్మాయిలతో రాసలీలల్లో మునిగి తేలేవాడట. ఇందుకోసం ఓ గెస్ట్‌హౌస్‌ను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నుంచే తన కార్యకలాపాలన్నీ చక్కబెట్టుకుంటూ వచ్చేవాడు. 
 
ఈ గెస్ట్‌హౌస్‌ను తన ప్రధాన అనుచరురాలు ఫర్హానా పేరుతో ఈ గెస్ట్‌హౌస్‌ను రిజిస్టర్‌ చేశాడు. దీనిని ఫర్హానా మారుపేరు కోకోనట్‌గా.. గోవా చర్చి పక్కనే ఉన్న మరో గెస్ట్‌హౌ్‌స్‌ను చర్చిహౌస్‌గా వ్యవహరించేవాడు. ఇక్కడ తరచూ సమావేశాలు జరుపుతూ ఇతర గ్యాంగ్‌స్టర్లతో భారీ ఒప్పందాలు కుదుర్చుకునేవాడు. తన భార్యతోపాటు ఫర్హానా, సదా, కరీనా, జేబా.. ఇలా వెళ్లిన ప్రతిసారి కొత్త అమ్మాయిని వెంటబెట్టుకు వెళ్లేవాడని పోలీసుల అధికారుల విచారణలో వెల్లడైంది. 
 
నయీం ఎన్‌కౌంటర్ తర్వాత నగర శివారు నెక్నాంపూర్‌లోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో పట్టుబడిన ఫర్హానా.. నయీం ప్రధాన అనుచరురాలు. గోవాలో వ్యవహారాలన్నీ ఫర్హానానే చక్కబెట్టేదని, నగదు లావాదేవీలు చూసుకునేదని విచారణలో వెల్లడైంది. లేడీడాన్‌గా అనుచరగణంలో ఫర్హానాలో ప్రత్యేక గుర్తింపు ఉండేదని అధికారులు తెలిపారు.