బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (11:35 IST)

ఆరోగ్యశ్రీలో కరోనా వైద్యం చేయని ఆసుపత్రుల అనుమతులు రద్దు: గుంటూరు జిల్లా కలెక్టర్

గుంటూరు జిల్లాలోని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కరోనా వైద్య సేవలు అందించని ఆసుపత్రులకు కరోనా ట్రీట్మెంట్ అనుమతులను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
గుంటూరు జిల్లాలోని మహాత్మాగాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (నరసరావుపేట), వికాస్ హాస్పిటల్ (పిడుగురాళ్ల), లైఫ్ లైన్ హాస్పిటల్(నరసరావుపేట) మెమోరియల్ హాస్పిటల్ (వినుకొండ), రాజరాజేశ్వరి హాస్పిటల్ (గుంటూరు) ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్నప్పటికీ కరోనా వైద్య సేవలందించిన కుండా బాధితులను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని సమాచారం మేరకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
 
ఈ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ అనుమతులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేస్తూ వెల్లడించారు.