శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (13:35 IST)

అత్తాకోడళ్ళ డిష్యూండిష్యూం : చపాతీ కర్రతో అత్తను చంపేసిన కోడలు

ఇటీవలి కాలంలో అత్తాకోడళ్ళ గలాటాలు ఎక్కువైపోతున్నాయి. దీంతో ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా ఓ కోడలు చపాతీ కర్రతో అత్తను చంపేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 29వ తేదీ రాత్రి తాడికొండ మైథిలి (55) అనే మహిళ హత్యకు గురైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో భాగంగా, కోడలిని అనుమానించి ఆమె వద్ద పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో అత్త వేధింపులు తాళలేక కూరగాయలు కోసే కత్తి, చపాతి కర్రతో కోడలు ఆమెను చంపేసినట్టు అంగీకరించింది. 
 
ఇంట్లో నిద్రిస్తున్న అత్త మైథిలిని విచక్షణ రహితంగా పొడిచి చంపిన కోడలుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోడలు రాధా ప్రియంక‌ను అరెస్టు చేసిన టూటౌన్ పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.