1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:06 IST)

అప్పు అడిగాడు... ఇవ్వ‌నంటే ఖ‌తం చేశాడు...

అప్పు అగితే ఇవ్వలేదనే కోపంతో ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో సంచలనం సృష్టించింది. కొండపాటూరు గ్రామంలో ఈనెల 23న హత్య జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి ఇంటి వెనుక నివాసం ఉంటున్న కిరణ్ కుమార్ అనే యువకుడు ఈ హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని విచార‌ణ‌లో తేల్చారు. 
 
డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో, సుత్తితో తలపై కొట్టి మృతుని ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని పరారయ్యాడ‌ని వివ‌రించారు. పొన్నూరు రూరల్ సీఐ ఆధ్వర్యంలో కేసు విచారించి ముద్దాయిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల డి.ఎస్.పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మృతుడు కొండపాటూరు గ్రామంలో పట్టాలు కుట్టుకుంటూ, వడ్డీ వ్యాపారం చేసుకునే మృతుడిని, ముద్దాయి కిరణ్ కుమార్ ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వకపోవడంతో, మృతుడు ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్లి సుత్తితో తలపై మోది అత్యంత దారుణంగా హత్య చేశారన్నారు.