సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (14:01 IST)

ఆస్తి కోసం తల్లీకుమార్తెను హత్య చేసిన బంధువు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం జరిగింది. ఆస్తి వివాదంలో తల్లీకుమార్తెను సమీప బంధువు హత్య చేశాడు. ఇంట్లో ఉన్న తల్లీ కుమార్తెను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. 
 
శనివారం జరిగిన ఈ దారుణ హత్య కేసుల వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా నాగార్జున నగర్‌లోని ఇంట్లో పద్మావతి, ప్రత్యూష  అనే ఇద్దరు తల్లీకుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో సమీప బంధువు శ్రీనివాస్‌ రావు ఇంట్లోకి వచ్చి ఇద్దరిపై విచాక్షణారహితంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. 
 
రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ.. కత్తిపోట్ల బాధను పంటిబిగువన భరిస్తూ యువతి తన సోదరుడికి ఫోన్‌ చేసి అప్రమత్తం చేసింది. అవే ఆమె చివరి మాటలయ్యాయి. ఇరుగు పొరుగు వాళ్లు అక్కడికెళ్లి చూసేసరికి.. తల్లీకూతుళ్లు చనిపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అందిర్నీ షాక్‌కు గురిచేసింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఆస్తి వివాదమే ఈ జంట హత్యలకు కారణంగా ఉందని పోలీసులు వెల్లడించారు.