సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 25 ఆగస్టు 2021 (18:44 IST)

అద్దింటివాడితో కోడలు వివాహేతర సంబంధం: గంటన్నరలో నలుగురిని హత్య చేసాడు

అద్దెకు దిగిన వ్యక్తితో కోడలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని కళ్లారా చూసాడు ఆమె మామ. కోడలు అద్దెవాడితో కులుకుతుందన్న సంగతి తెలిసి కూడా కుటుంబంలో ఎవ్వరూ ఆమెను మందలించకపోగా పట్టనట్లు వదిలేసారు. అద్దెకి దిగిన వ్యక్తి భార్య కూడా పల్లెత్తు మాట అనలేదు. అంతే... ఓ నిర్ణయానికి వచ్చేసాడతడు. ఇంటి తలుపులు వేసి ఇంట్లో మొత్తాన్ని వరసబెట్టి హత్య చేసేసాడు.
 
వివరాల్లోకి వెళితే.. హర్యానా గురుగ్రాంలో ఆర్మీ మాజీ అధికారి సాయిసింగ్ యాదవ్ తన భార్య, కోడలు, కూతురుతో వుంటున్నాడు. ఇతడి ఇంట్లో ఓ జంట అద్దెకు వుంటోంది. అద్దెకు దిగిన వ్యక్తి కోడలిపై కన్నేసాడు. మాటల్లో పెట్టి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు.
 
ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసినా పట్టనట్లు వదిలేసారు. కానీ యాదవ్ మాత్రం రగిలిపోయాడు. కత్తి తీసుకుని ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించి తొలుత ఇంట్లో అద్దెకున్న భార్యాభర్తలను చంపేసాడు. ఆ తర్వాత తన వుంటున్న ఇంట్లోకి వచ్చి తన భార్యను, కోడలిని నరికేశాడు. ఆ సమయంలో తన చిన్నకుమార్తె అడ్డురాగా ఆమెను కూడా గాయపరిచాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి జరిగినదంతా వివరించి చెప్పాడు.