శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (11:02 IST)

వెంటపడి ప్రేమించాడు.. పెళ్లి చేసుకుని అనుమానంతో కడతేర్చాడు..

గుంటూరు జిల్లా బాపట్లలో దారుణం జరిగింది. ఓ వివాహితను కట్టుకున్న భర్తే హత్య చేశాడు. వెంటపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. 17 యేళ్ళ కాపురం తర్వాత అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాపట్ల పట్టణంలోని మున్నంవారిపాలేనికి చెందిన పలిమినేని సత్యనారాయణరెడ్డి అదే ప్రాంతానికి చెందిన దివ్యను 17 సంవత్సరాలు క్రితం వెంటబడి ప్రేమించానని నమ్మించి పెళ్ళిచేసుకున్నాడు. 
 
కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి భార్య నిద్రపోతుండగా తలపగలగొట్టి పరారయ్యాడు. బాధితురాలిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహానికి బుధవారం పంచనామా నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు.