ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 31 ఆగస్టు 2024 (23:21 IST)

ఆ 300 మంది అమ్మాయిల వీడియోలు మీరు చూసారా? పో పోండి: మీడియాను తరిమేశారు

gudlavalleru college
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజి మహిళా హాస్టల్లో రహస్య కెమేరాల ఘటనను గురించి తెలుసుకునేందుకు, అక్కడి దర్యాప్తు పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన మీడియాను, మహిళా సంఘాల నాయకులను కాలేజీ యాజమాన్యం తరిమికొట్టింది. మీడియా వారంతా కలిసి... హాస్టల్ గదుల్లో రహస్య కెమేరాలు అమర్చి వీడియోలు తీసారంటూ వస్తున్న వార్తలపై మీరు ఏమంటారు అని ప్రశ్నించడంపై కాలేజీ యాజమాన్యానికి చెందిన కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
ఎవరయ్యా ఆ ప్రశ్న అడుగుతుందీ... 300 మంది అమ్మాయిల వీడియోలను తీసారా.. మీరు చూసారా? ఎక్కడ చూసారు, ఏం మాట్లాడుతున్నారు... నోటికి వచ్చింది మాట్లాడకండి. మైకులు, కెమేరాలు వున్నాయి కదా అని ఏదిబడితే అది మాట్లాడితే ఎలా అంటూ కసురుకున్నారు. ఒక దశలో మీడియావారి మైకులను పక్కకు నెట్టి దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు బాధితులకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాల నాయకులు బస్సులకు అడ్డంగా పడుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.