శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 30 ఆగస్టు 2024 (12:29 IST)

అమ్మాయిల స్నానాల గదుల్లో సీక్రెట్ కెమేరాలు: సీఎం చంద్రబాబు ఆగ్రహం

అమ్మాయిల స్నానాల గదుల్లో సీక్రెట్ కెమేరాలు అమర్చిన ఘటన కృష్ణా జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో లేడీస్ హాస్టల్ స్నానాల గదుల్లో సీక్రెట్ కెమేరాలు పెట్టారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై తమకు న్యాయం చేయాలంటూ హాస్టల్ విద్యార్థునులు నిన్న రాత్రి ఆందోళనకు దిగారు. సీక్రెట్ కెమేరాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు.
 
girls agitation
అసలేం జరిగింది?
గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలోని స్నానాల గదుల్లో సీక్రెట్ కెమేరాలను అమర్చారని గురువారం అర్థరాత్రి దాటాక విద్యార్థునులు ఆందోళన చేపట్టారు. వాష్ రూములలో సీక్రెట్ కెమేరాలు పెట్టి ఆ వీడియోలను విక్రయిస్తున్నాడంటూ ఓ బీటెక్ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టలకి వెళ్లి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి నుంచి అతడి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తున్నదంటూ పలువురు ఆరోపిస్తున్నారు.