శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (11:06 IST)

ఖాకీ డ్రెస్ ఉందనీ భార్యను వ్యభిచారం చేయమన్న హెడ్ కానిస్టేబుల్

అతడో హెడ్ కానిస్టేబుల్. వంటిపై ఖాకీ డ్రెస్ ఉందనీ వ్యభిచారం చేయమని కట్టుకున్న భార్యపైనే ఒత్తిడి తెచ్చాడు. ఇంతకీ ఈమె మూడో భార్య. ఆ ఖాకీ కామాంధుడి చిత్రహింసలు భరించలేక రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింద

అతడో హెడ్ కానిస్టేబుల్. వంటిపై ఖాకీ డ్రెస్ ఉందనీ వ్యభిచారం చేయమని కట్టుకున్న భార్యపైనే ఒత్తిడి తెచ్చాడు. ఇంతకీ ఈమె మూడో భార్య. ఆ ఖాకీ కామాంధుడి చిత్రహింసలు భరించలేక రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. దీంతో ఆ కామాంధుడి బాగోతం బహిర్గతమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కడప జిల్లా ఓబులవారిపల్లె మండల కేంద్రంలో హెడ్‌కానిస్టేబుల్‌గా చంద్రశేఖర్ పనిచేస్తున్నాడు. ఒంటిమీద ఖాకీ డ్రెస్‌ ఉందన్న పొగరుతో.. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటికే మూడు పెళ్ళిళ్లు చేసుకున్నాడు. మండల పరిధిలో కీచకుడిగా మారిన హెడ్‌కానిస్టేబుల్‌ బాగోతాన్ని ఆయన మూడో భార్య యశోద బయటపెట్టింది. 
 
యశోధకు ఇద్దరు పిల్లలు. 13 యేళ్ల వయసులో 7వ తరగతి చదువుతుండగా తనపై అత్యాచారం చేసిన హెడ్‌‍కానిస్టేబుల్ చంద్రశేఖర్‌.. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తంచేస్తోంది. తనకు అయినవారు ఎవరూ లేకపోవడంతో చంద్రశేఖర్‌ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడని యశోధ బోరున విలపిస్తూ వాపోయింది. 
 
పైగా, తనను వ్యభిచారం చేయాలంటూ నిత్యం వేధిస్తున్నాడని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ముందు మొరపెట్టుకుంది. తన పెళ్లి ఫోటోలు, పిల్లల ఫోటోలు.. ఇతర బాధలు పెట్టిన ఆధారాలన్నింటిని చైర్మన్‌ ముందు బయటపెట్టింది బాధితురాలు. అంతటితోనే ఆగలేదు.. తప్పుడు కేసులు పెట్టి పరువు తీస్తానంటూ.. పలువురు మహిళలను వేధించి లొంగదీసుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.
 
యశోధ ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్‌ చైర్మన్‌ వెంటనే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను ఫోన్ ద్వారా వివరించారు. హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌పై వెంటనే చర్యలు తసుకోవాలని ఆదేశించారు. నిందితుణ్ణి తక్షణం విధుల నుంచి, నిర్భయ చట్టం కింద కేసును నమోదు చేయాలని ఆదేశించారు.