గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2016 (10:00 IST)

గ్రూపు 2 పోస్టులు 100... దరఖాస్తులు 6.65 లక్షలు : ఏపీలో నిరుద్యోగానికి నిదర్శనం

సాధారణంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఉద్యోగంలో రావాలని కలలు కుంటారు. ఇందుకోసం కొందరు పట్టుదలతో కృషి చేసి సక్సెస్ అవుతారు. మరికొందరు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇంకొందరు మంచి కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న

సాధారణంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఉద్యోగంలో రావాలని కలలు కుంటారు. ఇందుకోసం కొందరు పట్టుదలతో కృషి చేసి సక్సెస్ అవుతారు. మరికొందరు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇంకొందరు మంచి కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు. 
 
అందుకేనేమో ఈ దఫా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) గ్రూపు 2 ఉద్యోగాల నోటిఫికేషన్‌కు విశేష స్పందన వచ్చింది. సుమారు 100 పోస్టుల కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకోసం ఏకంగా 6.65 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే సాగింది. ఈ లెక్క ప్రకారం ఒక్కో పోస్టుకు 665 మంది పోటీపడుతున్నట్లు తేలింది.
 
ఈ పోటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. టీడీపీ ఎన్నికల సమయంలో ఇంటికో జాబు ఇస్తానని హామీ ఇచ్చింది. జాబు రావాలంటే బాబు రావాల్సిందే అంటూ ఊదరగొట్టింది. ఉద్యోగం ఇవ్వకపోతే రెండువేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీని గంగలో కలిపింది టీడీపీ సర్కారు.