పట్టువదలని విక్రమార్కులు.. హీరో శివాజీ, రామకృష్ణ, చలసాని నిరసన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పట్టువదలని విక్రమార్కుల్లా సినీ హీరో శివాజీ, సిపిఐ నేత రామకృష్ణ, చలసాని శ్రీనివాస్ నిరసన తెలుపుతున్నారు. బీజేపీ, టీడీపీ నాటకాలాడుతూ, ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్లు తెలుగు ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
విజయవాడలో ప్రత్యేక హోదా కోరుతూ, వీరంతా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక హోదా సాధన సమితిగా ఏర్పడ్డారు. ఏపీఎస్‌వైఎఫ్ నేతలు నవనీతం సాంబశివరావు, పరుచూరి రాజేంద్ర బాబు, లంకా గోవిందరాజులు తదితరులు హోదా కోసం మళ్ళీ గోదాలోకి దిగారు. దీనితో ఏపీలో టీడీపీ, బీజేపీ నేతలు ఇరకాటంలో పడుతున్నారు.