శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (08:51 IST)

హైదరాబాదులో హైటక్ వ్యభిచారం.. రష్యన్ యువతితో పాటు మరో ముగ్గురు?

హైదరాబాదులో మరో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు అయ్యింది. ముఠా నిర్వాహకునితో పాటు మరో యువకుడు, రష్యన్ యువతితో పాటు మరో ముగ్గురు యువతులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హైటెక్ ముఠాకు

హైదరాబాదులో మరో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు అయ్యింది. ముఠా నిర్వాహకునితో పాటు మరో యువకుడు, రష్యన్ యువతితో పాటు మరో ముగ్గురు యువతులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హైటెక్ ముఠాకు చెందిన నిర్వాహకుడు అలెక్స్ (40)గా గుర్తించారు.

పోలీసుల అదుపులో ఉన్న వారిలో యువకుడు బీహార్‌కు చెందిన పంకజ్ కుమార్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళ, యువతులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతులను సంరక్షణ గృహానికి పంపించారు.  
 
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో గత నెలలో జరిగిన దాడుల్లో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. బంజారాహిల్స్ రోడ్ నెం.1 లోని తాజ్ దక్కన్ స్టార్ హోటల్‌లో పోలీసులు దాడులు జరిపారు. ఈ రైడ్స్‌లో జూన్‌ సినిమా ఫేం రిచా సక్సేనా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విటుల రూపంలో వెళ్లి సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. 
 
ఈ వ్యభిచార వ్యవహారంమంతా ఆన్‌లైన్‌ ద్వారా సాగుతున్నట్లు తేల్చారు పోలీసులు. ఈ దాడుల్లో నటి రిచాతో పాటు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మౌనిక కడాకియా, హోటల్ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.