బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (09:53 IST)

మసాజ్ ముసుగులో వ్యభిచారం... కండోమ్స్ స్వాధీనం...

మసాజ్ ముసుగులో సాగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, మాదాపూర్‌లో స్పా పేరుతో ఓ మసాజ్ సెంటర్ ఉంది.

మసాజ్ ముసుగులో సాగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, మాదాపూర్‌లో స్పా పేరుతో ఓ మసాజ్ సెంటర్ ఉంది. ఇందులో వ్యభిచారంతో పాటు.. ఇతర అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది.
 
దీంతో మసాజ్ సెంటర్‌పై ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు అమ్మాయిలతో పాటు ఇద్దరు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7 వేల నగదు, 6 సెల్‌ఫోన్లు, కండోమ్స్ ప్యాకెట్లు, స్వైపింగ్ మిషన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పరారిలో ఉన్న నిర్వాహకుడు విష్ణు కోసం పోలీసులు గాలిస్తున్నారు.