సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2017 (10:06 IST)

హైదరాబాద్ తంత్రా స్పాలో వ్యభిచారం...

హైదరాబాద్ నగరం వ్యభిచారానికి అడ్డాగా మారిపోతోంది. ఏదో ఒక చోట వ్యభిచార కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేస్తునే ఉన్నారు. ఇటీవల ప్రఖ్యాత తాజ్ డెక్కన్ హోటల్‌లో ఇద్దరు హీరోయిన్లు వ్యభిచారం చేస్తూ పట్టుబడి

హైదరాబాద్ నగరం వ్యభిచారానికి అడ్డాగా మారిపోతోంది. ఏదో ఒక చోట వ్యభిచార కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేస్తునే ఉన్నారు. ఇటీవల ప్రఖ్యాత తాజ్ డెక్కన్ హోటల్‌లో ఇద్దరు హీరోయిన్లు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విషయం తెల్సిందే. తాజాగా ఈ నగరంలో పేరుమోసిన స్పాలలో ఒకటైన తంత్రా స్పాలో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో స్పాను సీజ్ చేశారు. 
 
ఈ స్పా గచ్చిబౌలిలో ఉంది. గతంలో ఎస్‌ఓటీ పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో తంత్రా స్పాలో వ్యభిచారం నిర్వహిస్తుండగా రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. కేసు వివరాలను రాజేంద్రనగర్‌ ఆర్డీవో శ్రీనివాస్‌కు పంపించగా పరిశీలించి సీజ్‌ చేయాలని రాయదుర్గం సీఐ, శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను ఆదేశించారు. దీంతో బుధవారం ఈ స్పాను సీజ్‌ చేశారు.