సీఎం కేసీఆర్‌కు ఇవాంకా ట్రంప్ కృతజ్ఞతలు.. భారత్‌కు మళ్లీ వస్తా
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అమెరికా అధ్యక్షుని సలహాదారు, డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జిఇఎస్)లో ఆతిథ్యం భేష్ అన్నారు. ఈ మేరకు కేసీఆర్‌కు ఇవాంక లేఖ రాశారు. జిఇఎస్
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అమెరికా అధ్యక్షుని సలహాదారు, డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జిఇఎస్)లో ఆతిథ్యం భేష్ అన్నారు. ఈ మేరకు కేసీఆర్‌కు ఇవాంక లేఖ రాశారు. జిఇఎస్ సమ్మిట్ కోసం వచ్చిన తన హైదరాబాద్ పర్యటనలో మంచి ఆతిథ్యమిచ్చారని ఇవాంకా పేర్కొన్నారు.
అది నమ్మశక్యం కాని ఆతిథ్యమని ఇవాంకా తెలిపారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తనకు మనోహరమైన బహుమతిని అందజేసినందుకు కూడా ఇవాంకా కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక శ్రద్ధతో ఇచ్చిన ఆతిథ్యం, తెలంగాణ ప్రజలు చూపిన అభిమానం తన హృదయాన్ని తాకిందన్నారు. త్వరలో మరోసారి భారతదేశాన్ని సందర్శించేందుకు ఎదురు చూస్తున్నానని ఇవాంకా తన ఆకాంక్షను వెలిబుచ్చారు.
కాగా ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో ఇవాంకా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఇవాంకాకు పాతబస్తీలోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆతిథ్యం ఏర్పాటు చేశారు. నిజాం కాలంనాటి అతి పొడవైన డైనింగ్ టేబుల్‌పై ఏర్పాటైన విందులో ఇవాంకా పాల్గొన్న సంగతి తెలిసిందే.