సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (14:11 IST)

మదురైలో ఎంపీగా పోటీ చేస్తున్న హిజ్రా

2019 ఎన్నికల నామినేషన్‌ల పర్వం సోమవారం నుండి మొదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తన నామినేషన్‌లు దాఖలు చేసే పనిలో ఉన్నాయి. మరోవైపు నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారతీ కన్నమ్మ అనే హిజ్రా తమిళనాడులోని మధురై లోక్‌సభ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసారు. 
 
58 ఏళ్ల కన్నమ్మ 2004 నుండి ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడుతూ, సాంఘిక సేవలో పాల్గొంటున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సైతం కన్నమ్మ పోటీ చేసి 1,226 ఓట్లు సాధించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మధురై సెంట్రల్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో కన్నమ్మ ఉన్నారు. అవినీతిరహిత పాలన, జీవన ప్రమాణాల మెరుగుదల అలాగే మానవ హక్కులను కాపాడాలని కన్నమ్మ తన ప్రచారంలో కోరుతున్నారు.