బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 18 అక్టోబరు 2021 (11:53 IST)

ఎప్పుడూ తినే ప‌ళ్ళెంలో అన్నం మెతుకులను వదలం...

తాము అధికారం కోసం వచ్చిన వ్యక్తులం కాద‌ని, భారత్ ను గొప్పగా నిర్మించడమే త‌మ లక్ష్యం అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మహాన్ భారత్ ను నిర్మించే లక్ష్యంతో త‌మ‌ పార్టీ స్థాపించ బడినద‌ని చెప్పారు. భారత దేశం అజాదీకా అమృత్ మహోత్సవ్ జరపుకుంటున్న తరుణంలో ప్రతి వ్యక్తి చిన్ని చిన్న సంకల్పాలను తీసుకుంటే, అది దేశంలో అతి పెద్ద మార్పకు దారితీస్తుంద‌ని అమిత్ షా వివ‌రించారు. అండమాన్ నికోబర్ లో బిజెపి కార్యకర్తలు, మేధావులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్ షా ఇలా ప్ర‌సంగించారు. 
 
జీవిత కాలంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించను... ఎప్పుడు తినే ప‌ళ్ళెంలో అన్నం మెతుకులను వదలను.... గది నుంచి ఎప్పుడు బయటకు వచ్చినా, లైట్, ఫ్యాన్, ఎసీలను స్వీచ్ ఆఫ్ చేయాలనేటు వంటి చిన్న చిన్న సంకల్పాలు తల్లి భారతీని గొప్పగా తీర్చిదిద్దుతాయ‌ని అమిత్ షా చెప్పారు. ఇలా 130 కోట్ల మంది ఎవరికి వారు ఇలాంటి సంకల్పాలను తీసుకొంటే ప్రపంచంలో మన సముచిత స్థానం మనకు లభించక తప్పదు అని ఆయ‌న ఆశా భావం వ్య‌క్తం చేశారు.