శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:04 IST)

తెలంగాణ విమోచన దినోత్సవానికి హోం మంత్రి అమిత్ షా

ఈ నెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం జరుగనుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణా రాష్ట్రానికి రానున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్మల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు.
 
నిర్మల్‌లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి వెయ్యి మందికి పైగా అశువులు బాసిన స్థలం ఉన్నందున అక్కడ ఈ సభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.