శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (22:28 IST)

తెలంగాణలో నియంత పాలన: వైఎస్ షర్మిల

తెలంగాణలో నియంత పాలన పోవాలని.. రాజన్న రాజ్యం రావాలని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్ 12 వర్థంతి సందర్భంగా వైఎస్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్ సంస్మరణలో సభలో ఆమె మాట్లాడుతూ... అందరికీ నేను..అందరిలో నేను అనేలా వైఎస్‌ఆర్‌ జీవించారు’ అని అన్నారు. 

వైఎస్సార్ రూపం, చిరునవ్వు ప్రజల్లో ఎప్పటికీ చెరిగిపోదన్నారు. వైఎస్‌ఆర్‌కు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు లాంటి వైఎస్‌ షర్మిల తెలిపారు. తెలంగాణలో నియంత పాలన పోవాలని.. రాజన్న రాజ్యం రావాలని ఆమె ఆకాంక్షించారు.

వైఎస్ఆర్ పథకాలను సజీవంగా ఉంచాలనేదే తన లక్ష్యమన్నారు. ప్రజలకు సేవ చేయాలి అంటే రాజకీయాలు ఒక్కటే మార్గమని చెప్పారు. వైఎస్సార్ ఆశయాలు, పథకాలు అన్నీ అమలు చేస్తానని షర్మిల పేర్కొన్నారు.