వృద్ధులు మూడు టైపులు... తెలంగాణాలో అంతే!
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మూడు రకాల వృద్దులను గుర్తించింది.
తెలంగాణాలో సామాన్య ప్రజలు వృద్ధాప్య పెన్షన్ పొందాలి అంటే 57 ఏళ్ళు ఉండాలి. అంటే 57 ఏళ్ల తరువాత సామాన్యులు వృద్ధులు అవుతారు అన్నమాట. పింఛను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన వృద్ధుల వయసు ఇది.
ఇక రెండో రకం వృద్ధుల విషయానికి వస్తే... రైతు బంధు 59 ఏళ్ల వరకే వర్తిస్తుంది. అంటే 59 ఏళ్ల తరువాత రైతు వృద్దుడు అవుతాడు తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో. అందుకే అతనికి వ్యవసాయం చేసే అర్హత ఉండదు. రైతు బంధు పథకానికి అర్హుడు కాడు.
ఇక మూడో రకం వృద్ధులు... ప్రభుత్వోద్యోగులు... తమ ఉద్యోగాలకు పదవి విరమణ చేసే వయసు 61 ఏళ్ళు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు 61 ఏళ్ల తరువాత వృద్దులు అవుతారు తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో.
ఇలా మూడు రకాల వృద్ధాప్యాలను తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించడంతో ఎవరికి ఎపుడు వృద్ధాప్యం సంభవిస్తుందో తెలియని దుస్థితి ఏర్పడుతోందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.