శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 18 డిశెంబరు 2017 (17:35 IST)

విశాఖ బీచ్‌లో పట్టుబడ్డ మానవ చేప(ఫోటో), నిజమా?

సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని స్థితి అప్పుడప్పుడు ఎదురవుతోంది. మరీ ఎక్కువగా వాట్స్‌యాప్‌లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ వీడియో, కొన్ని ఫోటోలు అందులో షేర్ అవుతున్నాయి. వాటిని చూసిన కొందరు షాక్ తింటున్నార

సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని స్థితి అప్పుడప్పుడు ఎదురవుతోంది. మరీ ఎక్కువగా వాట్స్‌యాప్‌లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ వీడియో, కొన్ని ఫోటోలు అందులో షేర్ అవుతున్నాయి. వాటిని చూసిన కొందరు షాక్ తింటున్నారు. ఇంతకీ ఆ ఫోటోలు ఏమిటనేగా సందేహం.
 
విశాఖపట్టణం సముద్రతీరంలో చేపలు పట్టేవారి వలలో ఓ మానవ చేప పడిందట. ఆ చేపకు తల తోక మాత్రమే చేపకు వున్నట్లు అవయవాలు వుండగా, మధ్యభాగం అంతా మానవ ఆకారంలో వున్నది. చేతులు కూడా వుండటంతో వాటిని గట్టిగా విరిచి వెనక్కి కట్టేశారు. ఇది విశాఖలో పట్టుబడిందంటూ ప్రచారం మొదలెట్టేశారు. కానీ ఇదంతా అబద్ధమని తేలింది. ఈ చిత్రంలో కనిపిస్తున్నది చైనాకు సంబంధించిన ఓ సినిమాలోనిదిగా తేలింది.