సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2019 (10:30 IST)

అదనపు కట్నం తెస్తావా..? స్నానం చేసే వీడియోను నెట్‌లో పెట్టమంటావా?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. మానవ బంధాల మధ్య అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కట్నం కోసం కట్టుకున్న భార్యను వేధించాడు భర్త. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంటుంది. కట్నం కోసం తన భార్య స్నానం చేస్తుండగా ఫోన్‌లో వీడియో తీశాడు.
 
తనకు అదనపు కట్నం ఇవ్వకుంటే దాన్ని ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరింపులకు దిగారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కట్టుకున్న భార్యను పలుమార్లు కట్నం కోసం అతడు వేధింపులకు గురిచేశాడని.. ఇంట్లో హింసించాడని పోలీసుల విచారణలో తేలింది.