శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 12 జులై 2017 (09:22 IST)

కట్టుకున్నవాడే కడతేడ్చాడు... స్నేహితుడితో కలిసి భార్య హత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కట్టుకున్నోడే కడతేర్చాడు. తన స్నేహితుడితో కలిసి ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా బుచ్చి మండలం కట్టుబడిపాళెంలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే...

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కట్టుకున్నోడే కడతేర్చాడు. తన స్నేహితుడితో కలిసి ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా బుచ్చి మండలం కట్టుబడిపాళెంలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... 
 
కట్టుబడిపాళెంకు చెందిన చీదెళ్ల రంగయ్య, అంకమ్మ దంపతుల కుమార్తె జయంతి (33). ఆ యువతి ఎంసీఏ పూర్తి చేసింది. అల్లూరు మండలం ఇస్కపాళెం పరిధిలోగల ఖాదర్‌నగర్‌కు చెందిన ఖాదర్‌ మస్తాన్‌ అనే వివాహితుడు ఆటో నడిపుతూ జీవనం సాగిస్తూ వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో ఆటోలో రాకపోకలు సాగించే జయంతిపై మనస్సుపడ్డాడు. తనకు ఇంకా పెళ్లికాలేదు అని నమ్మించాడు. దీంతో జయంతి కూడా అతన్ని ప్రేమించింది. ఈ క్రమంలో జయంతిని తీసుకుని గత జనవరి 7వతేదీన తిరుమలకు వెళ్లిన ఖాదర్.. అక్కడే వివాహం చేసుకున్నాడు. 
 
ఆ తర్వాత ఎనిమిదో తేదీన తల్లి అంకమ్మకు జయంతి ఫోన్ చేసి జరిగిన విషయం తెల్సిందే. అనంతరం ఇద్దరూ హైదరాబాద్‌ వెళ్లారు, చివరగా జనవరి 11వ తేదీన తల్లికి జయంతి ఫోన్‌ చేసింది. ఆ తర్వాత ఫోన్‌ రాలేదు. అనుమానం వచ్చిన అంకమ్మ, ఖాదర్‌ మస్తాన్‌ వివరాలు సేకరించింది. అతనికి పెళ్లి అయినట్లు, పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. చివరికి మార్చి 27వ తేదీన కూతురు కనిపించడంలేదని అంకమ్మ బుచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మస్తాన్‌ అతడి స్నేహితుడైన నాయుడుపేట అన్నమేడుకు చెందిన నరేష్‌ను కూడా వెంట తీసుకుని హైదారబాద్‌ వెళ్లి అక్కడి నుంచి నిర్మల్‌లోని ముందుగా ఏర్పాటు చేసుకున్న ఇంట్లో కాపురం పెట్టారు. కాగా స్నేహితుడు నరేష్‌తో కలిసి జనవరి 9వ తేదీనే జయంతిని హత్య చేసి ఉరేసుకుని చనిపోయినట్లు చిత్రీకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
 
అయితే జయంతి మృతిపై నిర్మల్‌ పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదుచేసినట్లు సమాచారం. అప్పటినుంచి పరారీలో ఉన్న జయంతిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తునట్లు తెలిసింది. ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లిచేసుకున్న భర్త భార్య జయంతిని స్నేహితుడితో కలిసి ఎందుకు హత్య చేశారన్న విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది.