గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (13:23 IST)

వివాహేతర సంబంధం కారణంగా మరో దారుణం

వివాహేతర సంబంధాలు కారణంగా జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా హైదారబాద్ షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్ పేటలో మరో దారుణం జరిగింది. మలక్ పేటలో నివాసం ఉంటున్న జంగయ్య అదే గ్రామానికి చెందిన మహేష్(35)ను అతి కిరాతకంగా నరికాడు. 
 
తన భార్యతో మహేష్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న నెపంతో మహేష్ ఇంట్లోకి చొరబడిన జహంగీర్ అనుచరులు మహేష్‌పై విచక్షాణారహితంగా కత్తులతో దాడి చేశారు. 
 
తీవ్రంగా గాయపడిన మహేష్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మహేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. షామీర్ పేట్ సి.ఐ సంతోష్  సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.